Friday, January 3, 2025

ఎస్‌ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో సప్లయర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎస్‌ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ సప్లయ్ చేసిన గోవాకు చెందిన నిందితుడిని టిఎస్‌నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేసన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో టిఎస్‌నాబ్ పోలీసులు దాడి చేశారు. ఎపి, నెల్లూరు జిల్లాకు చెందిన ఆశిక్ , డుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 34ఎక్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పరీక్షనిర్వాహించారు. ఇందులో ముగ్గురు యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిని విచారించగా గోవాకు చెందిన హన్మంత్ బాబుసో దివ్‌కర్ అలియాస్ బాబా వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఒక్కపిల్ రూ.1,000 నుంచి రూ.1,200లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. సప్లయర్ కోసం గోవాకు వెళ్లిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పాడు.అందులో ఫిల్మ్‌నగర్‌లోని సాంక్చూరీ పబ్‌లో డిజే ఆపరేటర్‌గా పనిచేస్తున్న స్వదీప్‌కు 14 గ్రాముల కొకైన్ విక్రయించానని చెప్పాడు. దీనికి సంబంధించిన రూ.1.4లక్షలు ఇచ్చాడని చెప్పాడు. బాబా వద్ద నుంచి 25మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నిందితుడు కొకైన్, ఎండిఎంఏ, ఎక్టసీ పిల్స్‌ను బెంగళూరు నుంచి తెప్పించుకున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News