- Advertisement -
స్పష్టత ఇవ్వని టిఎస్‌పిఎస్‌సి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. టిఎస్‌పిఎస్‌సి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు మరో 11 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ.. అధికారులు ఇప్పటివరకు పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అంతేకాకుండా టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ సహా పలువురు సభ్యుల పదవులకు రాజీనామా చేశారు.
వారి స్థానాల్లో ప్రభుత్వం ఇంకా ఎవరిని నియమించలేదు.ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గ్రూప్ 2 పరీక్షలపై టిఎస్‌పిఎస్‌సి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కాగా, టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిన గ్రూప్ -2కు సుమారు 5 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
- Advertisement -