Monday, December 23, 2024

ఈ బడి ఒడి ..బతుకంతా దూరమేనా..6 ఏండ్ల బహారాకు కన్నీటి భారం

- Advertisement -
- Advertisement -

కాబూల్ : కరడుగట్టిన కట్టుబాట్ల అఫ్ఘనిస్థాన్‌లో ముక్కుపచ్చలారని 13 ఏండ్ల బహారా రుస్తం కన్నీటి చదువు కథ ఇది. కాబూల్‌లోని రజియా స్కూల్ ఆరవ తరగతి గదిలో ఈ నెల 11న తన తరగతి గదిలో ఈ బాలిక వెక్కివెక్కి ఏడుస్తూ కన్పించింది. ఈ స్కూల్ ఈ గది, తన రేపటి భవిష్యత్తుకు సాగే చదువుకు ఇదే తుదిరోజని తెలిసి వెక్కివెక్కి ఏడ్చింది. తన విద్యకు ఇక ముగింపు పలుకుతుంది. స్కూలు తలుపులు దాటుకుని తాను , ఇక తనకు శాశ్వతంగా తెరుచుకోకుండా ఉండే గేట్లు దాటి ముసుగుల పరదాల జీవితంలోకి ప్రవేశించే రోజులు వచ్చాయని బాధపడింది. చదువుకు తనకు బంధం తెగిపోతున్న వైనం చివరి రోజున ఆ బాలికను బావురు మనేలా చేసింది. తన క్లాసురూంకు తను వీడ్కోలు చెపుతూ ఇంటికి వెళ్లేక్షణం బహారాకు వయస్సుకు మించిన భారం అయింది. తాలిబన్ల పాలనలో బాలికల విద్య పట్ల పూర్తి స్థాయి అణచివేతకు దిగుతున్నారు. బాలిక కేవలం ఆరవతరగతి వరకూ చదవాల్సి ఉంటుంది.

ఆరవ తరగతి పూర్తి చేసుకునే బాలికలను గుర్తించి వారిని వెంటనే నేరుగా ఇంటికి పంపించేందుకు పాలకుల దూతలు వచ్చివాలుతుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బహారా వాస్తవిక కథ వెలుగులోకి వచ్చింది. 2021లో అమెరికా, నాటో సైనిక బలగాలు దేశం నుంచి వైదొలిగిన తరువాత తాలిబన్ల రాజ్యం ఏర్పడింది. వెంటనే తాలిబన్లు పూర్తిస్ధాయిలో తమదైన రీతిలో ఫర్మానాలతో పాలనకు దిగారు. మగువను ఇంటిపట్టునే ఉంచడం, ఉద్యోగినులను తొలిగించడం వంటి చర్యలతో తమ సాంప్రదాయ పరిరక్షణ చేపట్టిన చర్యలలో భాగంగా బాలికలు కేవలం ఆరవ తరగతి వరకే చదివి, తరువాత ఇంటిపనులకు , సంతానానికి పరిమితం కావాలని నిబంధనలు పెట్టారు. తరువాత ఈ స్త్రీ విద్య నిషేధాన్ని విశ్వవిద్యాలయాల స్థాయికి పొడిగించారు. ఈ కరకు నిబంధనలపై అంతర్జాతీయ స్థాయిలో ఎంతగానో నిరసనలు వ్యక్తం అవుతూ వచ్చాయి. అయితే ఖండనలను పట్టించుకోకుండా తాలిబన్లు ముందుకు సాగుతున్నారు.

ఇటువంటి చర్యలతో తాలిబన్ల సర్కారుకు అంతర్జాతీయ స్థాయిలో చట్టబద్ధమైన గుర్తింపు రాదని తెలిసినా ముందు తాము అనుకున్న విధంగా పూర్తిగా అఫ్ఘనిస్థాన్‌ను పూర్వపు దశకు తీసుకువెళ్లాలనే తపన క్రమంలో చేపట్టే చర్యల నడుమ ఇప్పుడు ఈ రజియా స్కూల్ విద్యార్థిని బహారా బలి అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News