Monday, January 20, 2025

మంత్రాలు చేస్తొందని మహిళ సజీవదహనం

- Advertisement -
- Advertisement -

దిస్‌పూర్: మంత్రాలు చేస్తొందనే నేపంతో ఓ మహిళపై దాడి చేసి అనంతరం ఇంటి ముందు సజీవదహనం చేసిన సంఘటన అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజ్ బాహ్‌బరి గ్రామంలో సంగీతా కటి అనే ఆదివాసి మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత కొన్ని రోజులుగా సంగీతా మంత్రాలు చేస్తుందని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. సూరజ్ బాఘ్వార్ అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి సంగీతాపై దాడి చేశారు. ఆమె భర్తను కట్టేశారు. ఆమెను గ్రామస్థులు అందరూ ముందు నగ్నంగా నిలబెట్టి సజీవదహనం చేశారు. వెంటనే గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంగీతా, సూరజ్ కు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News