Sunday, January 19, 2025

న్యూయార్క్ వీధుల్లో హీరో విశాల్.. పక్కన ఆ ఆమ్మాయి ఎవరు?

- Advertisement -
- Advertisement -

హీరో విశాల్ న్యూ యార్క్ వీధుల్లో సరదాగా నడుస్తూ వెళ్తుండగా ఎవరో అభిమాని వీడియో తీసి, నెట్లో పోస్ట్ చేశాడు. అయితే విశాల్ ఒక్కడే లేడు.. పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. ఇద్దరూ చెట్టపట్టాల్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆ అమ్మాయి మొహం కనిపించలేదు. విశాల్ ను చూసిన ఓ అభిమాని.. హలో విశాల్ అని పిలిచాడు. అంతే, విశాల్ వెంటనే తన చొక్కాకున్న హూడీని పైకి లాక్కుని, అమ్మాయితోపాటు పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లో భాగమని కొందరు కొట్టి పారేస్తున్నారు. క్రిస్మస్ వేడుకల కోసం విశాల్ ఇలా ప్లాన్ చేశాడని కొందరు, తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగమని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News