Saturday, November 23, 2024

ప్రజాభవన్ కారు కేసులో ట్విస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద శనివారం అర్ధారాత్రి జరిగిన కారు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్లక్షంగా కారు నడపడంతో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 2.45 గంటలకు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు కారు నడిపిన బోదన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తీసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు రావడంతో సీన్ మారింది. షకీల్ కుమారుడిని తప్పించి అతడి ఇంట్లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ ఆసిఫ్‌ను కారు నడిపినట్లు చేర్చారు.

ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన నార్త్‌జోన్ డిసిపి విజయ్‌కుమార్ దర్యాప్తు చేసి నిజాలు భయటకు తీశారు. మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సిసిటివి ఫుటేజ్‌లో తేలింది. వెంటనే అబ్దుల్ ఆసిఫ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కారులో ఉన్న మరో యువకుడిని పరీక్ష నిర్వహించగా మద్యం తాగనట్లు తెలిసింది. కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

ఉన్నతాధికారులు విచారణతో…
ఉన్నతాధికారులు కారు ప్రమాదం కేసులో స్టేషన్‌కు వచ్చి విచారణ చేయడంతో ఇన్స్‌స్పెక్టర్‌కు ఒక్కసారిగా బీపి పెరిగి ఆస్పత్రి పాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించే క్రమంలో తాము ఇరుక్కున్నామని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఇన్స్‌స్పెక్టర్ చికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. విచారణ చేసిన డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సమర్పించనున్నారు. దానికి అనుగుణంగా పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News