న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో దాడికి గురైన ఇండియన్ షిప్ భారత్ చేరుకుంది. దాడికి గురైన వ్యాపార నౌక ఎంవి ఫ్లూటోలో విచారణ చేపట్టారు. భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాలపై విసృ్తత విచారణ చేపట్టిన అధికారులు.. తాజాగా మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్, సాంకేతిక విశ్లేషణ చేపట్టామని నౌకాదళాధికారులు వివరించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ విక్రమ్ రక్షణలో, ఎంవి కెమ్ ప్లూటో సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముంబై నౌకాశ్రయానికి చేరుకుంది.
ఓడపై దాడి ఎలా జరిగిందనే దానిపై భారత కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, సంబంధిత అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. నౌకపై దాడి చేసేందుకు ఉపయోగించిన క్షిపణినా లేక డ్రోనా అనే విషయాన్ని గుర్తించేందుకు ఏజెన్సీలు ప్రయత్నిస్తాయి. నౌకలో లభ్యమైన పేలుడు పదార్ధాలు, శకలాలను బట్టి ఇది ఖచ్చితంగా డ్రోన్ దాడేనని భావిస్తున్నారు.