Friday, December 20, 2024

గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు..

- Advertisement -
- Advertisement -

ములుగు: ఆర్‌టిసి బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగా గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటన సిద్దిపేట జిల్లా, మండల కేంద్రమైన ములుగులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ..మంగళవారం సిద్దిపేట డిపోకి చెందిన ఆర్‌టిసి బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తోంది. మార్గమధ్యంలో ములుగు హవెళ్లి ఫాం వద్దకి రాగానే అతివేగంతో ఉన్న బస్సు ముందుగా వెళ్తున్న హెచ్‌పి గ్యాస్ ట్యాంకర్‌ను వెనుక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆర్‌విఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం, ట్యాంకర్ వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News