Monday, December 23, 2024

హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా దాడులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఇరాక్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలపై అమెరికా మంగళవారం వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో సైనికులు హెజ్బొల్లాపై దాడులకు దిగారని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.‘ ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపునకు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్‌లోని మా బలగాలు దాడులకు పాల్పడ్డాయి. కచ్చితమైన లక్షాలను ఎంచుకుని వరుస దాడులు చేశాం. ఇరాక్, సిరియాల్లో మా బలాలపై ఇటీవల మిలిటెంట్లు తరచూ దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశాం’ అని ఆస్టిన్ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రస్తుతం క్యాంప్ డేవిడ్‌లోని అధ్యక్షుడి విడిదిలో క్రిస్మస్ సెలవులు గడుపుతున్నారు. సోమవారం మిలిటె్ంల దాడి జరిగిన వెంటనే అమెరికా రక్షణ సలహాదారు సల్లివాన్ రక్షణ మంత్రి ఆస్టిన్ బైడెన్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ ఫైనర్‌తో ప్రతీకార వ్యూహంపై చర్చలు జరిపారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బైడెన్ తన జాతీయ భద్రతా టీమ్ సమావేశం ఏర్పాటు చేసి కతైబ్ హెజ్బొల్లా, దాని అనుబంధ మిలిటెంటు గ్రూపులు ఉపయోగించే మూడు స్థావరాలపై దాడులు చేయాల్సిందిగా ఆదేశించినట్లు ఆ అధికారి చెప్పారు. అమెరికా సైనికులపై దాడి జరిగిన 13 గంటల్లోనే అమెరికా దాడి జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News