Thursday, November 14, 2024

బానిస మనస్తత్వం నుంచి బైటికొస్తున్న భారత్: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమ మాతృభూమి కోసం జీవించడాన్ని సిక్కు గురువులు భారతీయులకు బోధించారని, ఈ దేశాన్ని మెరుగైనదిగా, అభివృద్ధి చెందినదిగా చేయడంలో స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిక్కు గురువు గురు గోబింద్ సింగ్‌కు చెందిన ఇద్దరు కుమారులు అమరులైన దినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలో ఈర్ బాల్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ దేశం ఇప్పుడు బానిస మనస్తత్వంనుంచి బయటికి వస్తోందని, దేశ ప్రజలు, వారి శక్తిసామర్థాలు, వారసత్వం పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. గురుగోబింద్ సింగ్ కుమారులు జోరవార్ సింగ్, ఫతేసింగ్‌లను మొగలు చక్రవర్తులు ఉరి తీశారు.

వీరి త్యాగాన్ని భారత్‌లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ , గ్రీస్ లాంటి దేశాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రపంచమంతటా గుర్తు చేసుకుంటున్నారని ప్రధాని అన్నారు. యువకుల అంతులేని ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం వద్ద స్పష్టమైన విజన్, రోడ్డుమ్యాప్ ఉన్నాయని మోడీ చెపారు. ఇప్పుడు భారత దేశాన్ని అవకాశాల భూమిగా ప్రపంచం చూస్తోందని ఆయన అన్నారు. ప్రతి రంగంలోను భారత్ గర్వంగా నిలబడిందని కూడా ఆయన అన్నారు. మనం ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసుకోరాదని ఈ సందర్భంగా ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ యువకులకు పిలుపునిస్తూ మీరు ఫిట్‌గా ఉంటే మీ కెరీర్‌లు, జీవితాలు సూపర్ ఫిట్‌గా ఉంటాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News