Monday, December 23, 2024

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద బాంబు పేలినట్లు ఢిల్లీ పోలీసులకు ఫోన్‌కాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో బాంబు పేలుడు సంభవించినట్లు మంగళవారం సాయంత్రం పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేశారు. దీంతో వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ హుటాహుటిన ఎంబసీ వద్దకు చేరుకుని ఆ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వెళ్లారు. అయితే ఎంబసీ సమీపంలోని ప్రజలకు పెద్ద పేలుడు శబ్దం వినిపించినట్లు సమాచారం.ఈ సంఘటనపై తమకు సమాచారం అందినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ కూడా ధ్రువీకరించింది.

సాయంత్రం 5.47 గంటలకు ఫోన్‌కాల్ వచ్చిందని, చాణక్యపురిలోని ఎంబసీ వద్దకు వెళ్లినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ పేర్కొన్నారు. అక్కడ తనిఖీలు చేపట్టామని, పేలుళ్లకు సంబంధించిన ఆనవాళ్లేమీ లభించలేదని తెలిపారు. తమకు వచ్చింది తప్పుడు సమాచారంగా పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా తమ ఎంబసీ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, కేసు దర్యాప్తులో స్థానిక అధికారులకు వారు సహకరిస్తున్నారని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ తెలియజేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News