Monday, November 25, 2024

ప్రధాని ’అభయం‘

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీకి వివరించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రధానితో తాము జరిపిన చర్చల వివరాలను ఢి ల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరులసమావేశంలో సిఎంరేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా,రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్ర ధానిమోడీని కలిశామని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా భట్టి చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము చేసిన విజ్ఞప్తుల పట్ల ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇస్తామని మోడీ హామీచ్చారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గు రించి ప్రధానితో చర్చించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్ర ధానిని కోరామన్నారు.విభజన చట్టం ప్ర కారం ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హో దా ఇవ్వాలని ప్రధాని మోడీని అడిగామని అందులో భాగంగా పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరామని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని, తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక స్కూల్ మంజూరు చేయాలని అడిగామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వం వల్ల ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందని ఆయన విమర్శిం చారు. అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు త్వరగా విడుదల చేయాలని కోరినట్లు భట్టి వెల్లడించారు.

ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి సడలింపు అడగలేదు
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి సడలింపు గురించి అడగలేదని భట్టి వివరించారు. కానీ, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ప్రధానికి వివరించామని ఆయన పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయాన్ని చేస్తామని ప్రధాని అన్నారని భట్టి తెలిపారు. ప్రతి శాఖాపరంగా కేంద్రం నుంచి పెండింగ్ నిధులు గురించి నివేదిక ఇచ్చామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి ప్రధానమంత్రికి నివేదిక అందించనట్టు ఆయన తెలిపారు.

తొలిసారి ప్రధానితో భేటీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తొలిసారిగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, 2019, -20, 21,-22, 22,-23, 23,-24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ గ్రాంట్‌లను రూ.1,800 కోట్లు విడుదల చేయాలని వారు ప్రధానమంత్రిని కోరారు. పెండింగ్‌లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022, -23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-,24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంటనే విడుదల చేయాలని వారు ప్రధానిని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News