ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏ మిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో ఎందుకు నరేంద్రమోడీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం లేదని ఆయన ప్రశ్నిం చారు.చర్చల ద్వారా మనం పరిష్కారం కనుగొనలేకుంటే గాజా, పాలస్తీనాకు పట్టిన గతే మనకూ జమ్ముకశ్మీర్‌లో ఎదురు కావచ్చని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
గతవారం పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు సహా నలుగురు భారత సైనికులు మరణించిన సంఘటనను ప్రస్తావిస్తూ ఫరూ క్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.‘మిత్రులను మార్చుకోగలం కానీ పొరుగువారిని మార్చుకోలేమ ని అటల్ బిహారీ వాజ్‌పాయ్ తరచూ చెప్పేవారు. పొరుగువారితో మనం స్నేహంగా ఉంటే ఇద్దరూ ప్రగతి సాధించవచ్చు. యుద్ధం ఒక్కటే మార్గం కాదని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని మోడీ అంటున్నారు. మరి చర్చలు ఎక్కడ ? నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్న తరుణంలో కూడా భారత్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కానీ మనం చర్చలు జరపకపోవడానికి కారణం ఏమిటి ?” అని ఆయన ప్రశ్నించారు.