- Advertisement -
అమరావతి: కరోనా వైరస్ సోకి ఓ మహిళ(51) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఓ మహిళ అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమె దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండడంతో కోవిడ్ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆమెను కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయిందని జిజిహెచ్ వైద్యులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఆమెను వెంటాడంతోనే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లా రెండు కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
- Advertisement -