Monday, December 23, 2024

కారులో ప్రముఖ నటుడి శవం

- Advertisement -
- Advertisement -

అస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పారసైట్’ మూవీలో నటించిన ప్రముఖ కొరియా నటుడు లీ సున్-క్యూ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ఆయన వయసు 48 ఏళ్లు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ఒక అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ లో ఒక కారులో ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

లీ సున్-క్యూ కొంత కాలంగా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఒక బార్ లో వెయిట్రెస్ గా పనిచేసే మహిళ తనను డ్రగ్స్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తోందని లీ గతంలో ఆరోపించాడు. అయితే తన భర్త సూసైడ్ నోట్ పెట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయాడంటూ లీ భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారికి సెంట్రల్ సియోల్ లోని ఒక అపార్ట్ మెంట్ పార్కింగ్ ఏరియాలో కారులో లీ మృతదేహం కనిపించింది.

లీ సున్-క్యూ నటించిన పారసైట్ కు 2020లో నాలుగు ఆస్కార్ అవార్డులు లభించాయి. 1975లో జన్మించిన లీ.. హెల్ప్ లెస్, ఆల్ ఎబౌట్ మై వైఫ్ వంటి హిట్ చిత్రాలలో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News