- Advertisement -
నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు రాజీనామా చేశారని, కొత్త పాలకవర్గాన్ని నియమించాక పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, నియామకాలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుత పాలకవర్గం రాజీనామాలు గవర్నర్ వద్ద పరిశీలనలో ఉన్నాయని, వాటిపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే నాలుగైదు రోజుల్లో కొత్త పాలకవర్గాన్ని నియమిస్తామని చెప్పారు. కమిషన్ కు చైర్మన్ లేకుండా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2024 డిసెంబర్ 9 లోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరతామని రేవంత్ అన్నారు.
- Advertisement -