- Advertisement -
కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకువెళ్లిందనీ, తాము అధికారంలోకి వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలు కనిపించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారంనాడు ప్రజాపాలన లోగోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ లంకె బిందెలు ఉన్నాయని వస్తే, తమకు ఖాళీ కుండలు కనిపించాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఖాజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. పరిస్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత తమపై పడిందని ముఖ్యమంత్రి చెప్పారు.
రైతు బంధు పథకం కింద రైతు ఖాతాల్లో డబ్బు జమ చేయడంలో ఆలస్యం జరుగుతోందన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, గత ప్రభుత్వం డిసెంబర్ 20న మొదలుపెట్టి మార్చి వరకూ డబ్బులు జమ చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి రైతుకూ రైతు బంధు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
- Advertisement -