Saturday, November 16, 2024

దేశంలో భారత్ బియ్యం కిలో పాతికరూపాయలకే?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : త్వరలోనే దేశవ్యాప్తంగా రూపాయలు 25కు కిలోచొప్పున ప్రజలకు బియ్యం అందే అవకాశం ఉంది. టోకున ఈ తక్కువ ధరలకు నిత్యావసర సరుకు అయిన బియ్యం అందించేందుకు భారత్ బియ్యం పేరిట పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోందని వెల్లడైంది. ఈ భారత్‌బియ్యాన్ని ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు అయిన భారత జాతీయ వ్యవసాయ సహకార విఫణి సమాఖ్య (నాఫెడ్) జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్) , సంచార శకటాల ద్వారా ప్రజలకు అందిస్తారు. దేశంలో పలు ప్రాంతాలలో ప్రత్యేకించి బియ్యం ధరలు ఇప్పుడు పండుగల సీజన్‌కు ముందే విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ముందుగా ధరలకు కళ్లెం పడాల్సి ఉందనే విషయాన్ని కేంద్రం తక్షణ ప్రాధాన్యక్రమంగా ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఈ సరస ధరల బియ్యం భారత్ బియ్యంగా మార్కెట్‌లోకి నేరుగా ప్రజలకు చేరేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికారులు తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది.

అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికైతే నిర్థారించలేదు. ప్రభుత్వ చొరవతో ఇప్పటికే తగ్గింపు ధరలకు భారత్ ఆటా ( గోధుమ పిండి), భారత్ దాల్ ( పప్పులు) అందిస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత చవక ధరల బియ్యం కేంద్రీయ భండార్ దుకాణాల ద్వారా , కొన్ని ప్రాంతాలలో సంచార శకటాట ద్వారా కూడా పంపిణీ చేస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు చోట్లా బియ్యం ధరలు పెరిగాయి. కిలో రూ 44 దాటాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 1.4 శాతం పెరుగుదలగా రికార్డు అయింది. బియ్యం మరీ నాణ్యమైనది అయితే ఏకంగా రూ 50 , రూ 60 వరకూ పలుకుతోంది. ఎప్పుడూ ఒక్కటే లక్షం ఉంటుంది. ధరల నియంత్రణ, తద్వారా ద్రవ్యోల్బణ అడ్డుకట్ట అని ఈ క్రమంలోనే బియ్యం ధరల తగ్గింపు అని వెల్లడైంది.

మొత్తం 2000 విక్రమ కేంద్రాలలో అమ్మకాలు?
భారత్ బ్రాండ్ పేరిట ఇప్పటికే పప్పు, గోధుమ పిండి విక్రయిస్తున్నారు. వీటిని అమ్ముతోన్న దాదాపు రెండువేల కేంద్రాల నుంచే బియ్యం కూడా విక్రయిస్తారు. బియ్యం ధరల పెరుగుదల అడ్డుకట్టకు ప్రభుత్వం పలు చర్యలకు దిగుతోంది. బాస్మతేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. బాస్మతి బియ్యం ఎగుమతి ధరల ఖరారు జరిగింది. పలు ప్రాంతాలలో తృణధాన్యాల ధరలు నవంబర్‌లో 10.3 శాతం పెరిగాయి. దీనితో ఆహార ద్రవ్యోల్బణం మొత్తం మీద 8.7 శాతం మేర పెరిగింది. అక్టోబర్‌లో ఇది 6.61 శాతం ఉండేది. మొత్తం మీద సగటు వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ)ని బట్టి, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ఎంత మేరకు ఉందనేది స్పష్టం అయింది. కాగా ఇండియా రేటింగ్స్‌కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాల సరఫరా క్రమంలో చూపించే ఆర్థిక ప్రగతి సంఖ్యలకు అట్టడుగు స్థాయి ఆర్థిక సమీకరణలకు సరైన పొంతన లేదని తెలిపారు. ఇవి రెండూ పొంతన లేని విషయాలని తేల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News