హైదరాబాద్ : గిరిజన సంక్షేమ మోడల్ స్పోరట్స్ స్కూల్స్ ఔట్ సోర్సింగ్ విధానంలో స్పోర్ట్ కోచ్‌లుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లా కిన్నరసాని మోడల్ స్పోర్ట్ స్కూల్ (బాలురు) కాచనపల్లి మోడల్ స్పోర్ట్ స్కూల్ (బాలికలు), మహబూబ్‌నగర్ జిల్లా కొత్తగూడ మోడల్ స్పోర్ట్ స్కూల్ (బాలురు) లలో ఔట్ సోర్సింగ్ పద్దతి ద్వారా స్పోర్ట్ కోచ్ లు గా పనిచేయడానికి ఆర్చెరీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ లలో ఒక సంవత్సరం ఎన్‌ఎస్, ఎన్‌ఐఎస్ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తమ రెజ్యుమ్‌తో పాటు sportsofficertwd@gmail.com మెయిల్‌కు లేదాసంక్షమ భవన్‌లోని అకడమిక్ సెల్ లో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 8వ తేదీ తుది గడువుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్. నెం. 9908550250, 9247267050 అన్ని పని దినాలలో ఉ. 10:30 నుండి సా. 5:00 వరకు సంప్రదించవచ్చన్నారు.