Wednesday, January 22, 2025

ఉజ్వల లబ్ధిదారులకు రూ.450 కే ఎల్‌పిజి సిలిండర్ : సిఎం భజన్‌లాల్

- Advertisement -
- Advertisement -

జైపూర్ : ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి రాజస్థాన్ బిజేపి ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు, బిపిఎల్ గ్యాస్ కనెక్షన్ దారులకు ఎల్‌పిజి సిలిండర్లను రూ.450 కే అందించడానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 నుంచే ఈమేరకు లబ్ధిదారులకు అందించనున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌పిజి సిలిండర్‌ను ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కు అందిస్తున్నారు. టోంక్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి భజన్‌లాల్ ఈ ప్రకటన చేశారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అన్న ప్రధాని మోడీ నినాదంతో స్ఫూర్తి పొంది రాజస్థాన్ ప్రభుత్వం చక్కని పరిపాలనకు అంకితమైందని చెప్పారు.

మోడీ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో ప్రతి బిపిఎల్, ఉజ్వల లబ్ధిదారునికి రూ. 450 కే ఎల్‌పిజి సిలిండర్ అందిస్తామని తెలిపారు. దీనిపై సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుని బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి తాము అంకితమైనామని చెప్పారు. మహిళల భద్రత అన్నది తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, మహిళలపై గూండాలు నేరాలు ఆపాలని హెచ్చరించారు. గత ప్రభుత్వకాలంలో జరిగిన పేపర్‌లీక్ వంటి స్కామ్‌లపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News