Monday, December 23, 2024

ఎండుకొబ్బరికి మద్దతు రూ 300

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 250 నుంచి రూ 300 మేర పెంచింది. దీనితో ఇప్పుడు 2024 పంటకాలానికి ఈ మద్దతు ధర రూ 11,160 నుంచి రూ 12000కు చేరుతుంది. కేంద్ర మంత్రి మండలి సమావేశం బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ సాగు వ్యయంతో పోలిస్తే కనీసం 50 శాతం అత్యధిక స్థాయిలో మద్దతుధరను పెంచిందని కేబినెట్ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు.

బీహార్‌లో గంగానదిపై ఆరువరుసల వంతెన నిర్మాణానికి కూడా సమ్మతి తెలిపారు. బీహార్‌లోని డీఘా సోనేపూర్ ప్రాంతాల అనుసంధానానికి ఈ విస్తృతస్థాయి వంతెన ఏర్పాటు అవుతుంది. ఈ బ్రిడ్జి 4.56 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి రూ 3వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. త్రిపురలో 135 కిలోమీటర్ల పొడవు ఉండే ఖోవాయ్ హరినా రోడు వెడల్పు పనులకు కూడా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ 2,486. 78 కోట్ల వ్యయ అంచనాలు ఉన్నాయి. దేశంలో పలు ప్రాంతాలలో రోడ్ల అనుసంధానం, ఇప్పుడున్న వాటి విస్తరణ పనులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంందని కేంద్ర మంత్రి తెలిపారు.

అక్లాండ్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఆఫీసు
న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌లో కాన్సులేట్ జనరల్ ప్రారంభానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏర్పాటు వల్ల అక్కడి పలువురు భారతీయులకు ఇతరులకు సౌలభ్యం ఏర్పడుతుందని కేంద్రం పేర్కొంది. వచ్చే 12 నెలల్లో ఈ కాన్సులేట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News