Monday, December 23, 2024

సింగరేణి ఎన్నికల్లో ఎఐటియుసి ముందంజ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎఐటియుసి ముందంజలో ఉంది. మొత్తం 11 ఏరియాల్లో ఆరుచోట్ల ఎఐటియుసి విజయం సాధించింది. శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం1, రామగుండం2, భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాల్లో గెలుపొందింది. మిగిలిన ఐదుచోట్ల కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్‌టియుసి హవా కొనసాగింది. కొత్తగూడెం, కార్పొరేట్, రామగుండం3, ఇల్లందు ఏరియాల్లో విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. 11 ఏరియాల్లో ఆయా కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లభించింది. ఓవరాల్‌గా ఎక్కువ ఓట్లు లభించిన ఎఐటియుసికి గుర్తింపు కల్పించే అవకాశం ఉంది.

రికార్డు స్థాయిలో 94.15 శాతం పోలింగ్
తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 39,773 ఓట్లు ఉండగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయ్యేసరికి 94.15 శాతంగా రికార్డు స్థాయిలో ఉద్యోగులు, కార్మికులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News