Monday, December 23, 2024

మనది ప్రజల ప్రభుత్వం… దొరల ప్రభుత్వం కాదు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మనది ప్రజల ప్రభుత్వమని దొరల ప్రభుత్వం కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనదన్నారు. తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని, ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశామని, తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదన్నారు. ప్రజలు దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News