న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో 4,097 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ నుంచి 4,44,73,448 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో ఆరుగురు మృతిచెందారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
దేశవ్యాప్తంగా 5,33,346 కొవిడ్ మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం వరకు జెఎన్.1 సబ్-వేరియంట్ 109 కేసులు కనుగొనబడ్డాయి. జెఎన్.1 వేరియంట్ వల్ల కలిగే ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దేశంలో కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడంతో ఆసుపత్రులలో నమోదయ్యే కోవిడ్-19 అనుమానిత లేదా పాజిటివ్ కేసుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.