Thursday, October 24, 2024

మాయాను పిఎంగా ప్రకటిస్తేనే.. ఇండియాకు బిఎస్‌పి షరతు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే తాము ఇండియా కూటమిలో చేరుతామని బిఎస్‌పి షరతు పెట్టింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది విపక్షకూటమిలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ దశలోనే బిఎస్‌పి ఎంపి మాలూక్ నగర్ గుడ్‌న్యూస్ టుడే ఛానల్‌తో మాట్లాడారు. బిజెపికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలోపోరు సంఘటితం కావాలని, ఈ దిశలో బిఎస్‌పి ఇతర పార్టీలు కూడా ఇండియా కూటమి నేతలు పిలుపు నిస్తున్నారు.

అయితే తమ షరతుపై స్పందిస్తేనే ఇండియాలో చేరే సంగతి ఆలోచిస్తామని బిఎస్‌పి ఎంపి స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ వైఖరిలో ఎటువంటి మార్పు రావడం లేదని, తమ ఎమ్మెల్యేలను కొందరిని కాంగ్రెస్‌లోకి లాక్కున్నారని, ఇందుకు ముందుగా తమ అధినేత్రికి కాంగ్రెస్ పెద్దలు క్షమాపణలు చెప్పాలని, ఇక రెండో విషయం మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున ప్రకటించడం అని ఈ ఎంపి స్పష్టం చేశారు. దేశానికి దళిత ప్రధాని రావల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తమ నేతకు మించిన అర్హత ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News