Friday, December 20, 2024

శుక్రవారం రాశి ఫలాలు(29-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – సంఘంలో గౌరవం పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి.

వృషభం – మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. స్వల్ప అనారోగ్య సూచన.

మిథునం – కు ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు చికాకు కలిగిసాయి. జీవిత భాగస్వామి నుండి సాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.విందులు వినోదాలలో పాల్గొంటారు.

సింహం – కుటుంబ సమస్యలు తీరతాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు.

కన్య – అకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. భూముల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.అనుకోని వ్యక్తులు మాట సాయం చేస్తారు.

తుల – పనులలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండదు. ప్రయాణాలలో తొందరపాలు వద్దు. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధన, వస్తు లాభాలు. వాహనాలు నడిపే విషయంలో కొంత మెలకువ అవసరం.

వృశ్చికం – నూతన ప్రయత్నాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వాహనయోగం. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.క్రయవిక్రయాలలో లాభాలు అర్జిస్తారు.

ధనుస్సు – బంధువులతో ఏర్పడిన విరోదాలు పరిష్కరించుకుంటారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. నూతన వస్తు సేకరణ. అనవసరపు విషయాలలో జోక్యం వద్దు.

మకరం – గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ముఖ్యమైన నిర్ణయాలలో మెలకువ అవసరం. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు. సంతానం నుండి శుభవార్తలు వింటారు.

మీనం – అనుకోని సమస్యలు తీరి ఊరట చెందుతారు. శ్రమకు తగ్గ ఫలితం వుండదు. బాద్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు లాభిస్తాయి. సంతానము నుండి కీలక సమాచారం. ఆరోగ్యం పట్ల మెలకువలు అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News