పాకిస్తాన్‌కు అధికారికంగా భారత్ అభ్యర్థన
న్యూఢిల్లీ: కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయి బా చీఫ్ హషీజ్ సయీద్‌ను భారత్‌కు తీసుకువచ్చే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడిని భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్ ను భారత్ అధికారికంగా కోరినట్లు పలు జాతీయ మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి.హఫీజ్‌ను అప్పగించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు.
2008 నవంబర్ 26న దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ ఘటనలతో పాటుగా మరెన్నో ఉగ్రదాడుల్లో హహీజ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన హహీజ్‌పై ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. వీటితో పాటుగా అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించాడన్న ఆరోపణతో పాటుగా మనీ లాండరింగ్ కేసుల్లోను హఫీజ్‌పై పలు కేసులున్నాయి.
ముంబయి పేలుళ్ల కేసుల్లో విచారణను ఎదుర్కొనేందుకు హఫీజ్‌ను తమకు అప్పగించాలని భారత్ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. అయితే భారత్‌పాక్ మధ్య ఖైదీల అప్పగింతకు ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది. కాగా ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న పలు కేసుల్లో హఫీజ్ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 సంవత్సరాలు జైలుశిక్ష పడింది. గత ఏడాది భారత్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం( యుఎపిఎ) కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పడు తను పాకిస్థాన్‌లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కజి ముస్లింలీగ్( పిఎంఎంఎల్) పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు.