హైదరాబాద్: 80 వేల కోట్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ లక్షన్నర కోట్లకు చేరుతుందని, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు 95 వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టకు లక్ష ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారని, అన్నారం బ్యారేజికి కూడా నష్టం జరిగిందని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగిపోవడంపై ఐదుగురు మంత్రులు రివ్యూకు వెళ్లారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్లకే ప్రాధాన్యత ఇచ్చామని, 16 లక్షల ఎకరాల టార్గెట్‌తో 38 వేల కోట్లతో ప్రాణహిత చేపట్టేవారమని వివరించారు. మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని గత ప్రభుత్వానికి ఉత్తమ్ చురకలంటించారు. సడెన్‌గా ప్లాన్, ప్లేస్ మార్చేసి మేడిగడ్డ కట్టారని ధ్వజమెత్తారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును 80 వేల కోట్లతో మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఉత్తమ్ మండిపడ్డారు. పిల్లర్లు ఐదు ఫీట్ల లోతుకు కుంగిపోయాయని, పిల్లర్లు కుంగడంపై అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నించారు. త్వరలో కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -