పెద్దపల్లి: కాళేశ్వరం మొత్తం ప్రపోజల్ కాస్ట్ లక్షా 28 వేల కోట్లు అని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.93,800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు. కాళేశ్వరంపై నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలుమూరు ప్రాజెక్టుకు కూడా కాళేశ్వరం పేరుతో అప్పులు తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తికావడానికి అదనంగా 15 వేల కోట్లు కు పైగా అవసరం పడిందన్నారు. ఏడాదిన్నర కాలంగా మూడు వేల కోట్లకు పైగా కాళేశ్వరం బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అక్టోబర్ 21 నాడు సాయంత్రం పెద్ద సౌండ్ వచ్చిందని, కుట్ర కోణంగా అనుమానంతో ఫిర్యాదు చేశామని ఇఎన్‌సి అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత స్టోరేజ్ కెపాసిటీ 141 టిఎంసిలుగా ఉందని, ఇప్పటివరకు కాళేశ్వరం కింద 98,570 ఎకరాలు సాగు చేశామని పేర్కొన్నారు. మూడో టిఎంసి కోసం మరో 33400 కోట్లతో ప్రతిపాదన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మించాక ప్రధానంగా ఇచ్చింది స్థీరకరణ మాత్రమేనన్నారు. భూసేకరణ సమస్యలతో కొత్త ఆయకట్ట కష్టమేనని చెప్పారు. రెండు టిఎంసిల లిప్టింగ్‌కు కేవలం ఐదు వేల మెగావాట్ల కరెంట్ అవసరం వచ్చిందని, మూడో టిఎంసి పనులు చేస్తే మొత్తం 8450 మెగావాట్ల కరెంట్ అవసరం పడుతుందన్నారు. ఈ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి 173 టిఎంసిలు మాత్రమేనని, రెండు టిఎంసిల కెపాసిటీలకే 94 వేల కోట్లతో ప్రతిపాదన ఇచ్చామన్నారు. మూడు టిఎంసి కోసం మరో 33400 కోట్లతో ప్రతిపాదనలు తీసుకొచ్చామన్నారు.