Monday, December 23, 2024

పిడిగుద్దులు కురిపించుకున్న కౌన్సిలర్లు..వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు.ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రచ్చరచ్చగా మారింది.రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రాజెక్టులపై చర్చించేందుకు కౌన్సిల్ సభ్యులు సమావేశమయ్యారు. అయితే అధికారంలో ఉన్న బిజెపి సభ్యులే కొట్టుకున్నారు. బెంచీలు ఎక్కి మరీ తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అరవింద్ సంగల్, స్థానిక ఎంఎల్‌ఎ ప్రసన్ చౌదరి సమక్షంలోనే ఇదంతా జరిగింది.

కాగా రెజ్లింగ్ మ్యాచ్‌ను తలపించేలా బిజెపి సభ్యులు కొట్టుకోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఒక వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సంఘటన స్థానిక పాలనా పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని విమర్శించారు.అలాగే అధికార పార్టీలో విభేదాలు,వర్గాలను హైలెట్ చేస్తోందని ఎద్దేవా చేశారు. ‘ఎలాంటి అభివృద్ధి పనులను చేయనప్పుడు సమీక్షా సమావేశంలో ఇంకేం చర్చ జరుగుతుంది? కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది?’అని ప్రశ్నించారు. బిజెపి పాలనకు ఇదొక గుణపాఠమని అన్నారు. ‘సొంత భద్రతా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత సమీక్షా సమావేశానికి రండి’ అంటూ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News