Monday, January 20, 2025

ప్రాణాల మీదికి తెచ్చిన పెట్రోలు ఇంధన ట్యాంకర్ పేలుడు

- Advertisement -
- Advertisement -

టోటోటా : దురాశ ప్రాణాల మీదికి తీసుకువస్తుందని పశ్చిమాసియా దేశం లైబీరియాలో జరిగిన ఘటనతో వెల్లడైంది. ఇంధన ట్యాంకర్ పేలి 45 మంది దుర్మరణం చెందారు. దేశ మధ్యప్రాంతంలోని టోటోటాలో రహదారిపై వెళ్లుతున్న ఇంధన ట్యాంకర్ నుంచి ఇంధనం లీక్ అయింది. దీనిని గమనించి అక్కడికి భారీ సంఖ్యలో సమీప జనం గుమికూడారు . టిన్నులు, బకెట్లు తీసుకుని పెట్రోలు తీసుకుని వెళ్లేందుకు పెనుగులాడుతున్నప్పుడు ట్యాంకర్ అంటుకుని పేలింది.

ఈ ఘటనలో45 మంది కాలిపోయి,మాడి మసయ్యారు. అత్యధికుల శవాలు గుర్తు పట్టని రీతికి చేరాయి. సహాయక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. సమీపంలోనే మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. లైబీరియా ఉపాధ్యక్షులు జ్యూయల్ హోవార్డు టేలర్ ఈ విషాద ఘట్టానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News