Friday, December 20, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న డ్రైవర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ డ్రైవర్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 20గ్రాముల ఎండిఎంఏ, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కర్నాటక రాష్ట్రం, మారతల్లికి చెందిన శివరాంపూర్ బాబు కిరణ్ క్యాబ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కు బానిసగా మారాడు.

ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న దినకరన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకునేవాడు. తర్వాత ఆర్థిక అవసరాలు తీరాలంటే డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశాడు. దీంతో దినకరన్ వద్ద ఎండిఎంఏ డ్రగ్స్‌ను గ్రాముకు రూ.6,000లకు కొగోలు చేశాడు. దానిని తీసుకుని వచ్చి మూన్‌షైన్ పబ్బలోని పార్కింగ్‌లో విక్రియస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని కేసు దర్యాప్తు కోసం ఫిల్మ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి ఖలీల్‌పాషా, ఎస్సై షేక్‌కవియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News