Friday, November 22, 2024

భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శనకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ ఐఏఎస్, ఓఎస్డీ కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఉదయం 11: 10 నిమిషాలకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు భట్టి విక్రమార్క చేరుకోనున్నారు.11:20 గంటల నుంచి 12:30 గంటల వరకు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 12:40 గంటలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఎర్రుపాలెం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 గంటలకు ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ పథకం పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:45 గంటలకు ఎర్రుపాలెం నుంచి హైదరాబాదుకు హెలికాప్టర్ లో బయలుదేరుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News