- Advertisement -
సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యకం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని చెప్పారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని సిఎం సూచించారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయన్నారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -