- Advertisement -
హైదరాబాద్: మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని సమర్థవంతంగా నిరోధించేందుకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో న్యూ ఇయర్ సందర్భంగా యాభై రకాల డ్రగ్ టెస్టింగ్ పరికరాలను కొనుగోలు చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు చేయడానికి తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, పార్టీలు జరిగే ఇతర ప్రదేశాలలో డ్రగ్ పరీక్షలను నిర్వహించడానికి ఈ పరికరాలు ఉపయోగించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లకు ఈ డ్రగ్ టెస్టులు చేయనున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యమని నార్కోటిక్ బ్యూరో ఓ ప్రకటన చేసింది. డ్రగ్ టెస్టింగ్ పరికరాలతో ఒక వ్యక్తి లాలాజల నమూనాతో డ్రగ్స్ సేవించాడో లేదో నిమిషాల్లో కనుగొనవచ్చు.
- Advertisement -