జనవరి 22 కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని.. హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 విశిష్ఠమైన రోజుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం అయోధ్యలో ప్రధాని మోడీ.. రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. “అయోధ్య ధామ్ కు అమృత్ భారత్ రైలును ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ వందేభారత్ రైళ్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని నగరాలకు వందే భారత్ రైళ్లు విస్తరిస్తాం. దేశంలో మారుమూల ఆలయాలకు రైలు సౌకర్యం కల్పిస్తాం. గయ, లుంబిని, కపిలవస్తు, సారనాథ్ క్షేత్రాలను మరింత అభివృద్ధి చేస్తాం.
అయోధ్యలో అన్ని వసతులతో టౌన్ షిప్ లు నిర్మిస్తున్నాం. అయోధ్యలో రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తాం. అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా అన్ని సౌకర్యాలు కల్పించాం. ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిలో అయోధ్యది కీలక పాత్ర. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మికీ పేరు నామకరణం చేశాం. త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జన్మధన్యం. రోజు 10 లక్షల మందికి సేవలు అందించేలా అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించాం. అయోధ్య ధామ్ లో ఎక్కడ చూసినా.. రామనామం వినిపించాలి. జనవరి 22న రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. జనవరి 23 నుంచి ప్రజలంతా అయోధ్యకు రావొచ్చు. అయోధ్యను శుభ్రంగా ఉంచటం అయోధ్య వాసులదే బాధ్యత” అని చెప్పారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7
— ANI (@ANI) December 30, 2023