Monday, December 23, 2024

హమాస్ సొరంగాలపై భీకర దాడులు… 200మంది మృతి

- Advertisement -
- Advertisement -

టెల్‌అవీవ్: శుక్రవారం రాత్రి గాజా స్ట్రిప్ లోని ఖాన్ యూనిప్ పై ఇజ్రాయెల్ దాడులు జరపడంతో 200 మంది మరణించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ గాజా లోని సుసిరత్ శిబిరంపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసిందని పాలస్తీనియన్ మెడిక్స్ పేర్కొంది. హమాస్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడిఎఫ్) దాడులను మరింత ముమ్మరం చేసింది.

తాజా గాజా స్రిప్ లోని ఖాన్ యూనిస్‌లో హమాస్ సొరంగాలపై భీకర దాడులు జరిపినట్టు ఓ నివేదిక పేర్కొంది. గత రెండున్నర నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 21 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News