Sunday, January 19, 2025

ప్రజా సమస్యలపై సిఎం రేవంత్‌ను కలిసిన సిపిఎం నేతలు

- Advertisement -
- Advertisement -

ఆరు గ్యారెంటీల అమలుపై హర్షం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డికి సిపిఎం నేతలు వినతిపత్రం అందజేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో మాజీ ఎంఎల్‌సి చెరుపల్లి సీతారాములు , మాజీ ఎంఎల్‌ఏ జూలకంటి , రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య నేతృత్వంలో వారు సిఎంకు వినతిపత్రం అందజేశారు.

ఆరు గ్యారెంటీలను అమలుచేసే ప్రక్రియ ప్రారంభించడం ఆహ్వానించదగిన విషయమని, మిగిలిన వాగ్దానాల అమలుకు కూడా పూనుకుంటారని ఆశిస్తున్నామన్నారు. అర్హులైన పేదలందరికీ 120గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి రు.5 లక్షలు ఇవ్వాలని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ఖాళీ పోస్టులలో నియామకాలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అందరికీ వైద్యం అందేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.

CPM leaders 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News