Monday, December 23, 2024

ఆదివారం రాశి ఫలాలు(31-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన కార్యక్రమాలు అనుకున్నసమయానికి పూర్తి చేస్తారు. అనుకోని అవకాశం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ధన లాభం.

వృషభం – బంధవులతో ఏర్పడిన విరోదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. మిత్రుల నుండి సహాయం అందుకుంటారు. సంతానం నుండి ధన లాభం.ఆహ్వానాలు అందుకుంటారు.

మిథునం – జీవిత భాగస్వామితో అకారణ విరోదాలు ఏర్పడవచ్చు. మాటల సందర్భంలో నిదానం అవసరం శ్రమ పెరుగుతుంది. బాద్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభం సూచిస్తుంది.

కర్కాటకం – మిత్రుల ద్వారా ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు ఆనందం. కలిగిస్తాయి. ప్రముఖుల కలయిక విందు, వినోదాలు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందులు, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.

సింహం – వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు వుంటాయి. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపు బంధవుల నుండి శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి.

కన్య – ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. వస్తులాభం. సన్నిహితులతో సరదాగా గడుపుతారు.

తుల – భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం అందుతుంది. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృశ్చికం – ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంతానమునకు నూతన ఉద్యోగావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు.

ధనుస్సు – దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రుల నుండి వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు.

మకరం – కష్టానికి ఫలితం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి.

కుంభం – దూరప్రయాణాలు లాభిస్తాయి. బందువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి.అరుదైన ఆహ్వానాలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం – బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విందు, వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News