Friday, January 10, 2025

ప్రజాపాలన దరఖాస్తులకు నేడు, రేపు సెలవు

- Advertisement -
- Advertisement -
జనవరి 2-6 దాకా కొనసాగింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణను రెండు రోజుల పాటు ఆపివేయనున్నారు. 31వ తేదీ (ఆదివారం), 1వ తేదీ (సోమవారం) రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. తిరిగి 02వ తేదీ నుంచి 06 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28వ తేదీన ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యాంరటీల లబ్ధిదారుల ఎంపికంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News