Monday, November 25, 2024

అవార్డులు వెనక్కిచ్చేసిన వినేశ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన ఖేల్ రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. ఈ అవార్డులను ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కర్తవ్య పథ్ వద్ద అవార్డులను వదిలేసి వెళ్లిపోయింది. వెంటనే పోలీసులు అవార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెజ్లింగ్ మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ కావడం గమనార్హం. నిబంధనలను పాటించకపోవడంతో డబ్ల్యుఎఫ్‌ఐని క్రీడా మంత్రిత్వ శాఖ సస్సెండ్ చేయడంతో పాటు ఐఒఎ, అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News