Monday, December 23, 2024

33వ అంతస్థు పైనుంచి పడి టెకీ మృతి

- Advertisement -
- Advertisement -

27 ఏళ్ల సాప్ట్ వేర్ ఇంజనీర్ 33వ అంతస్థుపైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. మద్యం మత్తులో అతను పడిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నా, దీనివెనుక ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన కలకలం రేకెత్తిస్తోంది.

ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపాంశు శర్మ కొంతకాలంగా బెంగళూరులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు బట్టారహళ్లిలోని పశ్మినా అపార్ట్ మెంట్ ఆవరణలో అతని మృతదేహం పడిఉండగా పోలీసులు కనుగొన్నారు. దీపాంశు శర్మ అదే భవంతిలోని 33వ అంతస్థులో నివసించే తన స్నేహితుడితో కలసి మందు పార్టీ చేసుకున్నాడని తెలిసింది. మిగిలిన స్నేహితులు తెల్లవారుజామున చూస్తే శర్మ లేడు. బహుశా ఇంటికి వెళ్లిపోయాడేమో అని భావించిన స్నేహితులకు ఉదయమే భవంతి ఆవరణలో శర్మ మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీపాంశు శర్మ తన తండ్రితో కలసి అయ్యప్ప నగర్ సమీపంలోని కొడిగెహళఅలిలో నివాసముంటున్నాడు. ఆయన తండ్రి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News