ముంబయి: ఓ మర్డర్ కేసులో 31 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 1989లో దీపక్ భిసా అనే వ్యక్తి రాజు చిక్నాను హత్య చేశాడు. పోలీసులు దీపక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 1992లో దీపక్‌కు బెయిల్ లభించడంతో బయటకు వచ్చాడు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉండడంతో 2003లో భిసా కనిపించడం లేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కండివాలిలోని తులాస్‌కర్వాజిలో ప్రాంతంలో దీపక్ నివసించేవాడు. పోలీసులు అప్పుడప్పుడు దీపక్ గురించి విచారణ చేస్తే చనిపోయి ఉంటాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. బిసా భార్య పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 31 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు అతడి వయసు 62 సంవత్సరాలు. భిసాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ నితిన్ సాతమ్ తెలిపారు.
31 సంవత్సరాల తరువాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -