Monday, December 23, 2024

రాష్ట్రం నుంచి రాజ్యసభకు సోనియా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణనుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారా? రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మార్చినెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో రెండు కాంగ్రెస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణనుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ ఇప్పటికే ఒక తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపింది. ఒకవేళ సోనియా లోక్ సభకు పోటీ చేయని పక్షంలో, తెలంగాణ నుంచే ఆమెను రాజ్యసభకు ఎంపిక చేయాలని కూడా కమిటీ తీర్మానించింది.

లోక్ సభకు సోనియా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీనుంచి బరిలోకి దిగే  అవకాశం ఉన్నందున, ఆ స్థానాన్ని ప్రియాంక గాంధీకి కేటాయించి, సోనియా తెలంగాణకు మారవచ్చునని పిసిసి నేతలు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News