- Advertisement -
టిక్‌టాక్ వీడియో కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఇద్దరు అక్కచెల్లెల మధ్య గొడవకు దారి తీసిన టిక్‌టాక్ వీడియో… చివరికి వారిలో ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని గుజ్రాత్ జిల్లాలోని సరాయ్ అలంగీర్ పట్టణంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఇద్దరు అక్కాచెల్లెలు సబా అఫ్జల్, మరియా అఫ్జల్ మధ్య గొడవ జరిగింది.
వీడియో సరిగా తీయలేదని తీవ్ర ఆగ్రహానికి గురై కోపంతో 14 ఏళ్ల సబా అఫ్జల్ తన సోదరిని.. ఇంట్లో ఉన్న తుపాకీతో కాల్చింది. దీంతో తీవ్రంగా గాయపడి మరియా అఫ్జల్ చనిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరుడు సద్దర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -