- Advertisement -
బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికలపై చర్చించడానికి ఢిల్లీకి రావలసిందిగా కాంగ్రెస్ అధిష్ఠానం తనను పిలిచినట్టు కర్టాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ఆదివారం వెల్లడించారు. బోర్డులు, కార్పొరేషన్ల ఛైర్‌పర్శన్ నియామకాలపై ప్రశ్నించగా ప్రభుత్వం జాబితాను ఖరారు చేసే పనిలో ఉందని వివరించారు.
మొదట ఎమ్‌ఎల్‌ఎలను నియమించాలని అనుకున్నామని, కానీ ఇప్పుడు పార్టీ కార్యకర్తలను ఎంపిక చేయడంపై డిమాండ్ పెరిగిందన్నారు. అందువల్ల జాబితా తయారు చేస్తున్నామని చెప్పారు.
- Advertisement -