Sunday, December 22, 2024

రైతులకు రెండు పంటలకు నీరు అందిస్తాం

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు అన్యాయం: మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంటకు నీరు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. తమ నియోజకవర్గానికి నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు నీరు వదలి తమ రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఆదివారం ములుగు జిల్లా రంగారావు పల్లి సమీపంలో ఉన్న పంప్‌హౌస్‌ను పరిశీలించారు. రామప్ప రిజర్వాయర్ ద్వారా పక్క నియోజకవర్గాలకు గత ప్రభుత్వం సాగునీరు అందిస్తోందన్నారు. త్వరలో ఈ ప్రాంత అన్నదాతలకు రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పంప్‌హౌస్ నుంచి మిగతా మండలాలకు కూడా సాగు నీరు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పంప్ హౌస్ వద్ద పాకాలకు పైపులైన్ జంగాలపల్లి చెరువులోకి కూడా నీరు వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసందర్భంగా అదే పంపును స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. ఈ పంపు కింద ములుగు మండలంలోని 1300 ఎకరాలు, పాకాల 2300 ఎకరాలు సాగవుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News