Saturday, November 23, 2024

గ్రేటర్ పరిధిలో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లు రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టిఎస్ ఆర్టీసి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను నేటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఫ్యామిలీ- 24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మీ స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దన్న ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. నేటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News