Thursday, January 23, 2025

అదే జట్టు.. అదే జోరు!

- Advertisement -
- Advertisement -

పాక్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక

సిడ్నీ : పాక్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. మార్పులేమిలేకుండానే బరిలోకి దింపనున్నారు. కాగా, డేవిడ్ వార్నర్‌కి ఇదే చివరి టెస్ట్ మ్యాచ్ అని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 317 పరుగుల లక్ష్యాన్ని నాలుగో రోజు ఆటలో ఛేదించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 237 పరుగులకు కుప్పకూలింది.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యంతో 300 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, పాక్ జట్టు ఈ లక్ష్యాన్ని చేరుకోవడంతో చతికిల పడిపోయింది. ఇక ఆత్మ విశ్వాసంలో ఆస్ట్రేలియా మూడో టెస్టుకు సిద్ధమైంది. గెలుపె లక్షంగా బరిలోకి దిగుతోంది. సిడ్నీలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్నాం. డేవిడ్ వార్నర్ తన సొంత మైదానంలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. మేం అతని చివరి మ్యాచ్‌ను జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపాడు. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటికే 20తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియా జట్టు..
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News