Sunday, December 29, 2024

రాయల్‌గా.. స్టైలీష్‌గా..

- Advertisement -
- Advertisement -

తన అభిమానులకు కొత్త ఏడాది కానుక అందించాడు ఎన్టీఆర్. ఇప్పటి వరకు చూడని కొత్త ఫొటోతో క్యాలెండర్ రిలీజ్ చేసి, ఫ్యాన్‌కు అందించాడు. ఈ క్యాలెండర్‌లో ఎన్టీఆర్ రాయల్‌గా, స్టయిలిష్‌గా కనిపిస్తున్నాడు. బహుశా ఈ క్యాలెండర్ కోసమే అతను ఈ ఫోటో షూట్ చేసినట్లు ఉంది. అభిమానులను ఈ లుక్, ఈ స్టైల్ అలరింస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఇందులో భాగంగా కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు ఇలా తన స్టిల్‌తో క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ హీరో, తన కుటుంబంతో కలిసి జపాన్‌లో విహరిస్తున్నాడు. నూతన సంవత్సర వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్‌కు గ్లోబల్ లెవల్లో పేరు వచ్చింది. ఇక దేవర మొదటి భాగం టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ గ్లింప్స్ పనులు పూర్తి అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News